సినిమా- వ్యాపారం రెండిటినీ స‌మాంత‌రంగా న‌డిపించ‌డంలో కింగ్ ఖాన్‌ని కొట్టేవాడే లేడు. దొరికినంతా దోచుకో.. దోచినంతా దాచుకో.. అన్న‌ట్టే ఉంటుందీయ‌న వ్య‌వ‌హారం. అందుకే ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో అతడి పేరు శిఖ‌రాగ్రాన ఉంటుంది ఎప్పుడూ. వీలున్న‌చోట‌ల్లా పెట్టుబ‌డులు పెట్ట‌డం .. అంతే ధీటుగా లాభాలార్జించ‌డం బాద్‌షా షారూక్‌ఖాన్‌కి హాబీగా మారిపోయింది. ముఖ్యంగా క్రికెట్ పై పెట్టుబ‌డులు పెట్ట‌డం భారీగా ఆర్జించ‌డం రివాజు త‌న‌కి.

ఇప్ప‌టికే ఐపీఎల్ టీమ్‌ కోల్‌క‌త నైట్ రైడ‌ర్స్ ని కొనేశాడు. ఇక్క‌డ పెద్ద రేంజులో క్లిక్క‌య్యాడు. ఆ త‌ర్వాత వెస్టిండీస్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అక్క‌డ క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ టీమ్ `ట్రిన్‌బాగో నైట్ రైడ‌ర్స్‌`ని కైవ‌శం చేసుకున్నాడు. అందుకోసం భారీగానే పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లాడు. దాంతో అత‌డి ఆశ తీరిన‌ట్టు లేదు. ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా టీమ్‌ని కూడా కొనేయ‌బోతున్నాడు. సౌతాఫ్రికా టి-20 లీగ్‌లో ఓ టీమ్‌ని కొనేస్తున్నాడు. ఆ మేర‌కు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్‌తో చ‌ర్చ‌లు సాగించాడు. కేప్‌టౌన్ కేంద్రంగా ఉన్న ఓ ట్యాలెంటెడ్ టీమ్‌పై త‌న పెట్టుబ‌డులు కుమ్మ‌రిస్తున్నాడు. క్రికెట్ షారూక్ లీగుల్లో భారీ లాభాలు క‌ళ్లజూస్తున్నాడు కాబ‌ట్టే అత‌డు ఈ విష‌యంలో ఏమాత్రం రాజీకి వ‌స్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. సౌతాఫ్రికా టి-20 లీగ్ లో ఎనిమిది టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దీనిపై జూన్ 19న లండ‌న్ -లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుందని తెలుస్తోంది.

Leave a Reply

© 2018 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO