దేవసేన గా బాహుబలి తో ఆకట్టుకున్న అనుష్క .. ఇప్పుడు భాగమతి గా నటిస్తున్న విషయం తెలిసిందే. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. భాగమతి గా అనుష్క నటన ఓ రేంజ్ లో ఉంటుందట .. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ సినిమా మిగతా కార్యక్రమాలు పూర్తీ చేసి దీపావళి కానుకగా విడుదల చేస్తారట.

Leave a Reply

© 2018 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO