మంచు మనోజ్ నిన్న తీసుకున్న నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది. సినిమాలనుండి తప్పుకుంటున్నట్టు అయన ట్విట్టర్ లో పేర్కొనడం ఆసక్తిగా మారింది. దాంతో అయన అభిమానుల్లో తీవ్ర నిరాశలు మొదలయ్యాయి. ఎందుకు మనోజ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది. అయితే ఈ పోస్ట్ ను అయన వెంటనే తొలగించడంతో అసలు మనోజ్ ఏమి చేస్తున్నాడు .. ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడు అన్నది షాక్ ఇచ్చినా .. మనోజ్ నిర్ణయంతో ఫైర్ అయిన మోహన్ బాబు ఆయనకు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్పారట!! మరి అయన తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకుంటాడా .. లేదా అన్నది ఆసక్తి కలిగిస్తుంది.

Leave a Reply

© 7975 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO