ఇంగ్లాండ్ రాజధానిలో ఎవరు ఊహించని విధంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లండన్ లోని 27 అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతే కాకుండా బిల్డింగ్ మొత్తాన్ని ఈ అగ్నికీలలు సంతరించుకోవడంతో అగ్నిగోళంలా మారింది. దాదాపు ఆ 200 మంది బిల్డింగ్ లో ఉన్నారని సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 500 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతోంది లండన్ ప్రభుత్వం.

అంతే కాకుండా మంటలను ఆర్పేందుకు 50 ఫైర్ ఇంజన్ లను తెప్పించారు. ఈ ఘటనతో ఇంగ్లాండ్ ప్రజలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎలా అయినా భవనంలో ఉన్న వారిని కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొదటి భవనంలోని రెండవ అంతస్థులో చెలరేగిన మంటలు ఆ తరువుత భవనాన్ని మొత్తం అలుముకున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

© 6101 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO