రాష్ర్టపతి ఎన్నికలకు మరో నెల రోజుల గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ర్టపతి అభ్యర్థిత్వంపై రోజుకో పేరు తెరపైకి వస్తోంది. తాజాగా కేరళ గవర్నర్ సదాశివం పేరు వినిపిస్తోంది. సదాశివం గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తమిళనాడులోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ప్రస్తుతం కేరళ గవర్నరుగా ఉన్నారు. బీజేపీ – కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అధినేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్న సదాశివానికి న్యాయ – రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది.

Leave a Reply

© 9987 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO