మన దేశం లో సినిమా స్టార్స్ కీ క్రీడా కారులకీ క్రేజ్ భలే విపరీతంగా కనిపిస్తుంది. వారిని దేవుడితో కొలిచే వారు కూడా లేకపోలేదు. అలాంటి వాళ్ళు ఎంత బాధ్యత తో ఉండాలి సాఫ్ట్ డ్రింక్స్ మానేసిన కోహ్లీ పెప్సి కొ బ్రాండ్ ను పబ్లిసైజ్ చేయడం విరమించుకున్నాడు విరాట్ కోహ్లే . ఆరు ఏళ్లుగా దానికి ప్రచారకర్తగా ఉండి ఒకసారి ఎందుకు చేయడం మానేశారు అంటే అతని ఇచ్చిన సమాధానం చూడండి “ నేను ఏమైతే వాడతానో వేటిని నమ్ముతానో వాటిని ప్రచారం చేయడంలో అర్ధం ఉంది కానీ నాకు సంబంధం లేని వస్తువులను నేను ఎలా ప్రచారం చేయగలను చెప్పండి. అది మంచి పద్దతి కాదు నా దృష్టిలో. కేవలం డబ్బు కోసం నేను ఆ పని ఒప్పుకోలేను” అని చెప్పాడు. మన స్టార్సు వింటున్నారా మరి?

Leave a Reply

© 2018 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO