ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి వివాహానికి నిరాకరించడంతో ఆమెపై ప్రియుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె సోదరిపైనా దాడిచేసి గాయపరిచాడు. ఈ సంఘటన చెన్నైలోని రాయపేటలో ఆదివారం జరిగింది. వివరాలు.. చెన్నైలోని రాయపురానికి చెందిన షబీవుల్లా(28) ఫేస్‌బుక్‌ ద్వారా అనేక మందితో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాయపేట మహ్మద్‌ ఖాసీం రెండో వీధికి చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం ప్రేమగా మారింది.

ఇటీవల షబీవుల్లా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే అతన్ని వివాహం చేసుకునేందుకు యువతి తిరస్కరించింది. దీంతో షబీవుల్లా ఆదివారం యువతి ఇంటి దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతపెట్టాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు విని ఇంట్లోంచి బయటకు వచ్చిన యువతి సోదరిపై కూడా దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్ని‍ంచాడు. స్థానికులు షబీవుల్లాను చుట్టుముట్టి పోలీసులకు అప్పగించారు.

Leave a Reply

© 4360 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO