బ్యాటింగ్ అదరగొడుతూ, బౌలింగ్ లో నిప్పులు చెరుగుతూ, ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపించే క్రికెటర్ లు చాలా అరుదుగా దొరుకుతుంటారు.తమ జట్టుకు అలాంటి ఆణిముత్యం దొరికాడని అంటున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ప్రపంచం లోని ప్రతి క్రికెట్ జట్టు బెన్ స్టోక్స్ లాంటి అతగాడిని కోరుకుంటుందని మోర్గాన్ తెలిపాడు. ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో స్టోక్స్ ప్రదర్శన పై మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

స్టోక్స్ టీంలో ఉంటే భరోసా ఉంటుందని మోర్గాన్ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో స్టోక్స్ తన ప్రత్యేకతని చాటుకుంటాడు. అందుకే ఐపీఎల్ లో స్టోక్స్ కి భారీ డిమాండ్. స్టోక్స్ ఉండడం ఇంగ్లాండ్ జట్టు అదృష్టమని మోర్గాన్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ లలోనే కాక ఫీల్డింగ్ లో సైతం అదరగొట్టాడని ప్రశంసించాడు. స్టోక్స్ తమకు చాల పరుగులను సేవ్ చేసాడని మోర్గాన్ తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో స్టోక్స్ భారాన్ని తనపైన వేసుకుంటాడని, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అది రుజువైందని మోర్గాన్ తెలిపాడు. ఆస్ట్రేలియాక్ట్ తో జరిగిన మ్యాచ్ లో స్టోక్స్ అజేయ సెంచరీతో ఇంగ్లాండ్ ని గెలిపించాడు.

Leave a Reply

© 5243 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO