భారత ఐటి రంగంపై అమెరికా అధ్యక్ష పీఠంపైకి మెరుపులా వచ్చిన డోనాల్డ్ ట్రంప్ ప్రభావం పడిందనే చర్చ జరుగుతోంది. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టాల వలన కొంత ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అయినా ఐటిని సంక్షోభంలోకి నెట్టేంత కాదని కొన్ని కంపెనీలు గాంభీర్యాన్ని ప్రదర్శించాయి. కాగా ప్రఖ్యాత దిగ్గజ ఐటి సంస్థ విప్రో ఈ విషయంలో నిజాన్ని చెప్పేసింది. ట్రంప్ వలన ఐటి రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే అని పేర్కొంది.

ఇతర ప్రముఖ సంస్థలు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టిసిఎస్ లు తమ ఉద్యోగుల్ని తొలగించుకునే పనిలో ఉన్నాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నూతన పద్దతుల వలన ఉద్యోగాల కోత తాపడని చెబుతున్నా, ఈ పరిణామానికి ట్రంప్ ప్రభావం కూడా ఉందని తెలుస్తోంది.మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఐటి లో సంక్షోభం నెలకొని ఉండడంతో విప్రో సంస్థ అధినేత అజిత్ ప్రేమ్ జి తన వాటాని అమ్ముకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో అందరూ షాక్ కి గురయ్యారు. కాగా ఈ పుకార్లని అయన కొట్టి పారేశారు. తాను తన వాటాని ఎవరికీ అమ్మడం లేదని తెలిపారు.

Leave a Reply

© 4502 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO