గగనంలో ప్రయాణిస్తున్న విమానం ఆచూకీ ఒక్కసారిగా గల్లంతైతే ఆ వార్త ప్రయాణికుల కుటుంసభ్యులకు ఎంత భయకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మయన్మార్ కు చెందిన సైనిక విమానం ఆకాశంలోనే అదృశ్యమైంది. ఆ విమానంలో 116 మంది ప్రయాణిస్తుండడంతో కుటుంబ సభ్యలుల్లో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 1.35 గంటలకు విమానంతో సంబంధాలు తెగిపోయాయని మయన్మార్ సైనిక అధికారులు చెబుతున్నారు.

సైనికుల కుటుంబ సభ్యులు విమానంలో ప్రయాణిస్తున్నారు.విమానంతో సంబంధాలు తెగిపోయిన సమయంలో అండమాన్ సముద్ర ప్రాంతంలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో వాతావరణం బాగానే ఉందని కేవలం సాంకేతిక లోపమే సిగ్నల్స్ అందక పోవడానికి కారణం అయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మయన్మార్ ప్రభుత్వం అండమాన్ సముద్ర ప్రాంతంలో గాలింపు చర్యలు మొదలు పెట్టింది. గతంలో ఇదేవిధంగా మలేషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. ఆ తరువాత విమాన శకలాల ఆధారంగా విమానం సముద్రంలో పడిపోయిందని గుర్తించారు.

Leave a Reply

© 8278 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO