ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయాన్ని అధికార టిడిపి, బిజెపిలు ఎప్పుడో పక్కన మర్చిపోయాయి.ఈ విషయంలో నిస్సహాయతని ప్రదర్శిస్తున్న టిడిపి ఎంపీల పై పవన్ కళ్యాణ్ మరో మారు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రత్యేకహోదా పై మంగళవారం రాజ్య సభలో చర్చ జరిగిన సందర్భంగా టిడిపి ఎంపీలు ఎవరూ పాల్గొనకపోవడంతో పవన్ ఆగ్రహం వ్య్కత్మ చేసాడు. కాంగ్రెస్ సభ్యుడు రామచంద్రరావు ప్రవేశ పెట్టిన సావధాన తీర్మానం మంగళవారం చర్చికు వచ్చింది.ఆంధ్ర ప్రత్యేక హోదా గురించి చర్చ జరుగుతున్న సమయంలో టిడిపి ఎంపీలు సభలో లేకపోవడం, సభలో ఉన్నా ఆ అంశం పై నోరు మెదపని అశోక్ గజపతి రాజు పై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు.

ఈ విషయం లో తెలుగుదేశం పార్టీ కేద్రంతో రాజీ పడడం మంచింది కాదని పవన్ అన్నారు. ప్రతిపక్ష వైసిపి ఎంపీలు సభలో తమ వాదనని బలంగా వినిపించారని ప్రశంసించారు. తెలంగాణ ఎంపీలైనప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా చర్చలో పాల్గొన్న కేశవ రావు, రాపోలు ఆనంద భాస్కర రావులకు పవన్ కృతజ్ఞతలు తెలిపాడు. రాష్ట్ర విభజన సమయంలో మన ఎంపీ లపై ఉత్తరాది ఎంపీలు చేసిన దాడిని టిడిపి నేతలు మరచిపోయారా అని పవన్ ప్రశ్నించారు.

Leave a Reply

© 4399 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO