మిజోరాం రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే బిచ్ హువా తన ప్రత్యేకతని చాటుకుని అందరి మన్నలను పొందుతున్నారు. ఓ కార్యక్రమం కోసం తన నియోజక వర్గంలో పర్యటించారు. సైఫా జిల్లాలో ఓ మహిళ తీవ్ర కడుపు నొప్పితో భాదపడుతూ ప్రభుత్వాసుపత్రిలో చేరింది.కానీ ఆ సమయంలో ఆసుపత్రిలో సర్జన్ లు ఎవరూ లేరు. వారంతా శిక్షణ కోసం ఇంఫాల్ వెళ్లినట్లు తెలిసింది. కానీ మహిళకు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బిచ్ హువా హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి స్వయంగా ఆయనే ఆపరేషన్ నిర్వహించి మహిళా ప్రాణాలు నిలబెట్టారు. మహిళ కడుపులో చిన్న రంధ్రం ఏర్పడిందని వెంటనే ఆపరేషన్ నిర్వహించి ఉండకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం వాటిల్లి ఉండేదని ఎమ్మెల్యే అన్నారు. బిచ్ హువా స్వయంగా డాక్టర్ కావడం విశేషం. 20 ఏళ్ల పాటు ఆయన వైద్య వృత్తి లో ఉన్నారు. 2008 లో తొలిసారి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయినా 2013 లో సైహా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆపదలో ఉన్న మహిళని ఆడుకోవడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Leave a Reply

© 6071 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO