ప్రతిరోజూ నాలుగైదు రెమ్మల పచ్చి కరివేపాకు తింటుంటే చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది.కరివేపాకు డయాబెటిస్‌ను అరికట్టడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్‌ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజూ ఉదయం పరగడుపున గుప్పెడు కరివేపాకు (పచ్చిది కాని మరే రూపంలోనైనా) తినాలి.

ఇలా క్రమం తప్పకుండా వందరోజులు తింటే మంచి ఫలితం ఉంటుంది. హైబీపీ లేదా అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నట్లయితే పరగడుపున ఒక పచ్చి వెల్లుల్లి రేకు తినాలి. వెల్లుల్లి బ్లడ్‌ప్రెషర్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఓట్‌మీల్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మూడు వారాలపాటు ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Leave a Reply

© 2019 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO